ప్రతీకాత్మక చిత్రం
భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు.. కాసేపటికి సద్దుమణుగుతుంటాయి. కొందరు దంపతులు ఇంట్లో ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు అర్థం చేసుకోకపోవడంతోనే సమస్యలు తలెత్తుతుంటాయి. ముంబైలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. న్యూడ్ ఫొటోలు పంపమని భర్త నుంచి మెసేజ్ రావడంతో క్షణం ఆలోచించకుండా పంపించింది భార్య. ఇలా కొన్నాళ్లకు మరిన్ని ఫొటోలు పంపమని మెసేజ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి భర్తను ప్రశ్నించగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని మలాడ్ దిన్దోషి అనే ప్రాంత పరిధిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త ఆఫీసు పని మీద పొద్దున వెళ్లి రాత్రికి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం భార్యకు తన భర్త ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది. ‘‘ నీ న్యూడ్ ఫొటో పంపు’’.. అని మెసేజ్ రావడంతో, భర్తే కదా అని వెంటనే పంపించింది. కొన్నాళ్లకు మళ్లీ భర్త నుంచి.. ‘‘మరికొన్ని న్యూడ్ ఫొటోలు పంపు’’.. అని మెసేజ్ వచ్చింది. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఫొటోలను అందరికీ షేర్ చేస్తా అని బెదిరించాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన భర్తతో ఈ విషయంపై గొడవ పడింది. దీనికి భర్త.. ‘‘ అసలు నాకు ఇన్స్టాగ్రామ్ ఖాతానే లేదు’’.. అని చెప్పాడు. దీంతో భార్య అవాక్కై.. జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. తర్వాత ఇద్దరూ కలిసి మార్చి 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇన్స్టాగ్రామ్ ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ చేశారు. దంపతులు ఉంటున్న అపార్ట్మెంట్కు చెందిన 20ఏళ్ల యువకుడి ఖాతా నుంచి మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసింది. గత నవరాత్రుల సమయంలో బాధిత కుటుంబానికి, యువకుడి కుటుంబానికి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి మహిళ మీద కోపం పెంచుకున్న యువకుడు.. ఎలాగైనా అవమానించాలని కుట్ర పన్నాడు. దీంతోనే బాధిత మహిళ భర్త పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఇంత దారుణానికి ఒడిగట్టాడని తేలింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇవి కూడా చదవండి