నన్ను పెళ్లాడతావా అని అడగబోతే.. ఇల్లు తగలడిపోయింది!

ABN , First Publish Date - 2020-08-06T17:22:05+05:30 IST

ఆమె అతడి ప్రేయసి. ఎంతో కాలంగా ఇద్దరూ ఓకే ఇంట్లో నివసిస్తున్నారు. ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకోవాలని అతడికి అనిపించింది. ఇంత కాలం కలిసున్నాం.. ఇక పెళ్లికి టైం మొచ్చిందనుకున్నాడు. టైం మొచ్చింది కానీ అది పెళ్లికి కాదు అని పాపం అప్పుడు అతడికి తెలియదు. అందుకే..తన నెచ్చిలికి గ్రాండ్‌గా ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.

నన్ను పెళ్లాడతావా అని అడగబోతే..  ఇల్లు తగలడిపోయింది!

లండన్: ఆమె అతడి ప్రేయసి. ఎంతో కాలంగా ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. అయితే ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకోవాలని అతడికి ఇటీవల అనిపించింది. ఇంత కాలం కలిసున్నాం.. ఇక పెళ్లికి టైం వచ్చిందనుకున్నాడు. టైం వచ్చిన మాట వాస్తవమే కానీ అది పెళ్లికి కాదన్న విషయం పాపం అప్పుడు అతడికి తెలియదు.


అందుకే..తన నెచ్చిలికి గ్రాండ్‌గా ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. ఇల్లంతా కొవ్వొత్తులు పేర్చి వెలిగించాడు. బెలూన్లూ గట్రా వాటితో ఇల్లంతా అలంకరించాడు. ఓ టేబుల్..దానిపైన వైన్.. అన్ని రెడీ.. ఇక ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తేవడమే తరువాయి. అతడి మనసులోనే కాదు.. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది.  ఆ తరువాత..వేరే చోట ఉన్న తన నెచ్చెలిని వెంట బెట్టుకుని మరీ ఇంటి వద్దకు వచ్చాడు.


అంతే.. అక్కడి దృశ్యం చూసి ఆ జంటకు నోట మాట రాలేదు. ముఖ్యంగా యువకుడికైతే ముఖంలో నెత్తురు చుక్కలేకుండా పోయింది. కారణం.. అతడి ఇల్లు మంటల్లో పడి తగలడిపోతోంది. ఆ అగ్నీకీలల్లో తన పెళ్లి ప్రస్తావన కూడా బూడిదైపోయినట్టు అతడు ఫీలయ్యాడు. ఇంటి ఎదురుగా ఫైర్ ఇంజిన్లుతో నానా హడావుడిగా ఉంది. చూస్తూ ఉండగానే అంతా బుగ్గైపోయింది. బ్రిటన్‌లోని దక్షిణ యార్క్‌షైర్‌లో ఈ దారుణం జరిగింది.


కాగా.. ఈ ఘటనా క్రమాన్నంతా అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి ప్రస్తావన కాస్తా ఇలా ఊహించని మలుపు తిరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన నెటిజన్లు కూడా చెలించిపోయారు. ఒక్కోసారి.. అంతే..సరిపెట్టుకోక తప్పదు అంటూ నిట్టూర్చారు. అయితే  వ్రతం చెడినా ఫలితం దక్కాలి అన్నట్టు..  ప్రేయసి తనతో పెళ్లికి ఒప్పుకోవడం కాస్తంత తెరిపిన పడ్డాడా వ్యక్తి.

Updated Date - 2020-08-06T17:22:05+05:30 IST