Oh No!: ప్రేయసికి ప్రపొజ్ చేస్తుండగా.. ఆ క్యూట్ సీన్‌లోని సడెన్‌గా జిరాఫీ ఎంట్రీ.. ఆ తర్వాత షాకింగ్ ఘటన!

ABN , First Publish Date - 2022-07-26T15:21:49+05:30 IST

ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెప్పడమే కాదు.. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనేది ప్రతి ప్రేమికుడి ఆరాటం.

Oh No!: ప్రేయసికి ప్రపొజ్ చేస్తుండగా.. ఆ క్యూట్ సీన్‌లోని సడెన్‌గా జిరాఫీ ఎంట్రీ.. ఆ తర్వాత షాకింగ్ ఘటన!

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెప్పడమే కాదు.. అది ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనేది ప్రతి ప్రేమికుడి ఆరాటం. అలాగే మనోడు కూడా తన ప్రేయసికి ప్రపొజ్ చేయడం కోసం కొంచెం స్పెషల్‌గానే ప్లాన్ చేశాడు. కానీ, సీన్ కాస్తా రివర్స్ అయింది. ఆ ప్రపొజల్ సీన్‌లోకి సినిమాలలో మాదిరిగా హీరోహీరోయిన్ లవ్ మధ్యలో విలన్ ఎంట్రీ ఇచ్చినట్లు.. జిరాఫీ ఎంట్రీ ఇచ్చింది. అంతే.. ఆ సీన్ కాస్తా పూర్తిగా డిస్ట్రబ్ అయిపోయింది. యువతి మెడకు బ్యాండీజ్‌తో మంచం పట్టింది. ఈ ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2.8 మిలియన్ల వ్యూస్, 2.82లక్షల లైక్స్ వచ్చాయి.   


వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ వ్యక్తి తన ప్రియురాలికి లవ్ ప్రపొజ్ చేసేందుకు సఫారీ(Zoo)ని ఎంచుకున్నాడు. ప్రేయసితో కలిసి ఆ సఫారీకి వెళ్లిన అతడు.. అనుకున్నట్లే ప్రియురాలని సర్‌ప్రైజ్ చేస్తూ మోకాలిపై కూర్చొని లవ్ ప్రపొజ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ చేతిలో రింగ్ పట్టుకుని ఆమెను క్యూట్‌గా అడిగాడు. దాంతో ప్రేయసి అతడి ప్రేమను కాదనలేకపోయింది. ప్రియుడి ప్రేమను ఆనందంగా అంగీకరించింది. దాంతో తాను తెచ్చిన రింగ్ తీసి ఆమె చేతి వేలికి తొడిగేందుకు రెడీ అవుతుండగా.. ఆ క్యూట్ సీన్‌లోకి సడెన్‌గా జిరాఫీ ఎంట్రీ ఇచ్చింది. అంతే.. క్షణాల్లో అంత మారిపోయింది. 


లవ్ సీన్‌లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన జిరాఫీ యువతిని వెనక్కి లాగేయడంతో ఆమె కిందపడిపోయింది. మెడకు దెబ్బ తగలడంతో బ్యాండెజీతో మంచం పట్టింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2.8 మిలియన్ల వ్యూస్, 2.82లక్షల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'నీవు రింగ్ తొడిగే ఘట్టాన్ని పూర్తి చేశావు. నేను ఆ తర్వాతి ఘట్టాన్ని(ముద్దాడడం) పూర్తి చేస్తానని జిరాఫీ అనుకుందంటూ' ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'కనీసం రింగ్ తొడిగేవరకైనా అగొచ్చుగా' అని మరో నెటిజన్ రాశాడు. 'నీకు పెళ్లికూతురిని ముద్దాడాలనే విషయం తెలుసా? అని జిరాఫీ ప్రశ్నించినట్లుందని' ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. 



Updated Date - 2022-07-26T15:21:49+05:30 IST