క్యాపిటల్ భవనం వద్ద బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

Apr 3 2021 @ 07:35AM

ఓ పోలీసు మృతి, మరొకరికి గాయాలు

అదుపులోకి అనుమానితుడు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 2: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్ష భవనం వద్ద బారికేడ్లపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ పోలీసు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్లుండి ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఓ పోలీసుతో పాటు అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.