ఓ మహిళతో రెండేళ్లుగా సహజీవనం.. ఆమె కుమార్తెపై కన్నేసి..!

ABN , First Publish Date - 2021-06-22T17:43:06+05:30 IST

ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న ఓ ప్రబుద్ధుడు

ఓ మహిళతో రెండేళ్లుగా సహజీవనం.. ఆమె కుమార్తెపై కన్నేసి..!

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : ఓ మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న ఓ ప్రబుద్ధుడు ఆమె కూతురిపై కన్నేశాడు. ఆటో డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి ఓ మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మైనర్‌ అయిన ఆమె కూతురుపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బస్తీవాసుల ద్వారా తెలుసుకున్న చైల్డ్‌ కేర్‌ టీమ్‌ సభ్యులు ఆ బాలికను కలిసి వివరాలు సేకరించి నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మిగతా వివరాలు తర్వాత వెల్లడిస్తామని నార్సింగ్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-22T17:43:06+05:30 IST