YouTube స్టార్‌ను చేస్తానని చెప్పి పదహారేళ్ల బాలికను కీచకుడు ఏం చేశాడంటే...
ABN , First Publish Date - 2022-01-31T17:42:18+05:30 IST
యూట్యూబ్‌లో టాప్ స్టార్‌ని చేస్తానన్న సాకుతో ఓ కీచకుడు పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం...
జోధ్‌పూర్: యూట్యూబ్‌లో టాప్ స్టార్‌ని చేస్తానన్న సాకుతో ఓ కీచకుడు పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం రాజస్థాన్‌లోని పాలిలో వెలుగు చూసింది.మూడు నాలుగేళ్లుగా యూట్యూబ్ లో కామెడీ వీడియోలు చేస్తున్న 16 ఏళ్ల బాలికకు జోధ్‌పూర్‌లోని బాబ్రా (పాలి) హాల్లో నివసిస్తున్న నిజాముద్దీన్ అలియాస్ రాజ్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. యూట్యూబ్‌లో టాప్ స్టార్‌ను చేసి ఎదిగి డబ్బు సంపాదించేలా చేస్తానని బాలికకు కీచక యువకుడు ఎర వేశాడు. ఇదే క్రమంలో జనవరి 8వతేదీన వీడియో తీస్తానని చెప్పి బాలికను జోధ్‌పూర్‌లోని ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెబుతానని బాధితురాలు చెప్పడంతో నిందితుడు ఆమెపై దాడి చేసి బెదిరించాడు.
దీంతో మైనర్ బాలిక కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. బాలిక పాలి వచ్చిన వెంటనే జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించింది. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పారిశ్రామిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జనవరి 28వతేదీన జోధ్‌పూర్‌లో నిజాముద్దీన్‌ను అరెస్టు చేశారు.