సీఎం Mamata Banerjee ఇంటి వద్ద ఉగ్రవాది 7 సార్లు రెక్కీ

ABN , First Publish Date - 2022-07-12T17:40:28+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటి వద్ద ఓ ఉగ్రవాది ఏడుసార్లు రెక్కీ చేసిన ఘటన....

సీఎం Mamata Banerjee ఇంటి వద్ద ఉగ్రవాది 7 సార్లు రెక్కీ

భద్రత పెంపు...సెక్యూరిటీ డైరెక్టర్ తొలగింపు

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటి వద్ద ఓ ఉగ్రవాది ఏడుసార్లు రెక్కీ చేసిన ఘటన సంచలనం రేపింది.కోల్‌కతా నగరంలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న సీఎం మమతా ఇంటి గురించి సమాచారం తెలుసుకునేందుకు ఉగ్రవాది హఫీజుల్ మొల్లా ఏడుసార్లు రెక్కీ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాది తన సెల్ ఫోన్ కెమెరాతో సీఎం నివాసం ఫొటోలు తీశారని వెల్లడైంది. ఉగ్రవాది రెక్కీ చేసిన సమయంలో స్థానిక పిల్లలకు టాఫీలతో రప్పించాడని దర్యాప్తులో వెలుగుచూసింది. జులై 2-3వతేదీల మధ్య రాత్రి హఫీజుల్ మొల్లా భద్రతా ఏర్పాట్లను దాటి బెనర్జీ నివాసంలోకి ఇనుప రాడ్‌తో ప్రవేశించడాన్ని సెక్యూరిటీ గార్డులు గుర్తించారు. 


నిందితుడి మొబైల్ ఫోన్‌లో సీఎం ఇంటి ఫొటోలు ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు.మొల్లా 11 సిమ్‌కార్డులను ఉపయోగిస్తున్నాడని, బంగ్లాదేశ్‌తో పాటు జార్ఖండ్, బీహార్‌లలోని ఫోన్ నంబర్లకు కాల్‌లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.గతేడాది దుర్గాపూజ సందర్భంగా ఈదుకుంటూ బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడ కొన్ని రోజులు బస చేశాడు. పొరుగు దేశంలో అతడి కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నారు.మొల్లాకు ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు సూచనలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి చెప్పారు.మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని జులై 18 వరకు పొడిగిస్తూ సిటీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ముఖ్యమంత్రికి ఉన్న జెడ్-ప్లస్ భద్రతను ఉగ్రవాది ఎలా దాటాడు అనే ప్రశ్నలు తలెత్తాయి.ఈ ఘటన నేపథ్యంలో సీఎం నివాసం, పరిసరాల్లో భద్రతను అధికారులు పెంచారు. ఈ రెక్కీ వ్యవహారంపై సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్‌ను ఆయన పదవి నుంచి తొలగించారు.


Updated Date - 2022-07-12T17:40:28+05:30 IST