కరోనా టెస్టు చేయించుకోలేదు, తన ఫోన్ నెంబర్ ఎవరికీ తెలియదు.. అయినా 16 సార్లు..

ABN , First Publish Date - 2021-07-28T01:35:36+05:30 IST

ఒక్కసారి కూడా కరోనా టెస్టు చేయించుకోని ఓ వ్యక్తికి కరోనా రిపోర్టులకు సంబంధించి ఏకంగా 16 మెసేజీలు వచ్చాయి. బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కరోనా టెస్టు చేయించుకోలేదు, తన ఫోన్ నెంబర్ ఎవరికీ తెలియదు.. అయినా 16 సార్లు..

బెంగళూరు: ఒక్కసారి కూడా కరోనా టెస్టు చేయించుకోని ఓ వ్యక్తికి కరోనా రిపోర్టులకు సంబంధించి ఏకంగా 16 ఎస్‌ఎమ్‌ఎస్‌లు వచ్చాయి. బెంగళూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30కు ప్రారంభమైన ఈ సందేశాల పరంపర రెండు గంటల పాటు కొనసాగింది. ప్రతిసారీ తనకు ఓ కొత్త పేరుతో ఎస్ఎమ్‌ఎస్ వచ్చిందని ఎమ్. సజయ్ అనే వ్యక్తి ట్విటర్‌లో వెల్లడించారు. అవన్నీ నెగెటివ్ రిపోర్టులని కూడా పేర్కొన్నారు. తన ఫోన్ నెంబర్‌ను బయటెక్కడా ఇవ్వకపోయినా ఇలా జరిగినందుకు ఆయన ఆశ్చర్యపోయారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉండొచ్చనే అనుమానాన్నీ వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సజయ్ ట్విటర్ ద్వారా ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. 

Updated Date - 2021-07-28T01:35:36+05:30 IST