భార్యతో కలిసి ఉండలేనని సుప్రీం కోర్టుకు వెళ్లిన భర్త.. మోసం పూరితంగా తనకు పెళ్లి చేశారని వాదన.. అసలు పెళ్లిలో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-15T05:46:43+05:30 IST

ఇటీవల దేశ అత్యున్నత కోర్టు అయిన సుప్రీం కోర్టులో ఒక వ్యక్తి తనకు మోసం చేసి పెళ్లి చేశారని.. అందువల్ల తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా కేసు వేశాడు. అతని వాదన విన్న తరువాత న్యాయమూర్తలు...

భార్యతో కలిసి ఉండలేనని సుప్రీం కోర్టుకు వెళ్లిన భర్త.. మోసం పూరితంగా తనకు పెళ్లి చేశారని వాదన.. అసలు పెళ్లిలో ఏం జరిగిందంటే..

ఇటీవల దేశ అత్యున్నత కోర్టు అయిన సుప్రీం కోర్టులో ఒక వ్యక్తి తనకు మోసం చేసి పెళ్లి చేశారని.. అందువల్ల తనకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా కేసు వేశాడు. అతని వాదన విన్న తరువాత న్యాయమూర్తలు సైతం కేసు విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. ఆ వ్యక్తి న్యాయమూర్తుల ముందు తన భార్య గురించి షాకింగ్ విషయం చెప్పాడు. ఆ విషయం తనకు పెళ్లి ముందు చెప్పకుండా దాచారని.. ఇక తాను భార్యతో కాపురం చేయలేనని వివరించాడు.


వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరానికి చెందిన మధుసూదన్(పేరు మార్చబడినది) అనే వ్యక్తికి 2016లో భవ్య(పేరు మార్చబడినది) అనే యువతితో రెండో వివాహం జరిగింది. అంతకు ముందు అతని మొదటి భార్య అనారోగ్యం కారణంగా మరణించింది. మొదటి భార్య ద్వారా మధుసూదన్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహం జరిగిన తరువాత భవ్య తన భర్తతో శృంగారం చేసేందుకు అంగీకరించలేదు. కొద్ది రోజుల సమయం అడిగింది. కానీ రోజులు గడిచినా భార్య శృంగారం చేసేందకు నిరాకరించడంతో గొడవ మొదలైంది. చివరికి పెద్దలు కలుగచేసుకొని భవ్యను ఒప్పించారు. అయితే అసలు సమస్య అప్పుడే మొదలైంది.


భవ్యతో పడకగదిలోకి ప్రవేశించిన మధుసూదన్‌ తాను మోసపోయానని గ్రహించాడు. భవ్య జననాంగాలు పురుషుడి మాదిరిగా ఉన్నాయి. దీంతో ఆమెను తీసుకొని మధుసూదన్‌ డాక్టర్ల వద్దకు వెళ్లాడు. డాక్టర్లు ఆమె శరీరం లోపల భాగం మహిళలా ఉన్నప్పటికీ.. జననాంగాలు పురుషాంగాన్ని పోలీ ఉన్నయని చెప్పారు. దీంతో ఆమెతో శృంగారం చేయడానికి వీలుకాదని.. పైగా ఆమెకు పిల్లలు పుట్టరని ధృవీకరించారు. డాక్టర్లు చెప్పిన విషయాలు విని మధుసూదన్ విస్తుపోయాడు. తనకు ఈ విషయాలేవీ పెళ్లికి ముందు చెప్పకుండా మోసం చేశారని భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత ఆమెను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. 


ఈ ఘటన తరువాత ఇరు కుటుంబాల మధ్య గొడవల మొదలయ్యాయి. మధుసూదన్ తనకు విడాకుల గురించి చెప్పాడు. దానికి భవ్య అంగీకరించలేదు. పైగా భర్తపై గృహహింస కేసు పెట్టింది. జిల్లా కోర్టులో మధుసూదన్ తన వాదన వినిపించగా.. కోర్టు భవ్యకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ భవ్య కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టులో భవ్య ప్రకృతిపరంగా మహిళ అనే వాదనపై విడాకులు మంజూరు కాలేదు. 


హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని మధుసూదన్ సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. భవ్య, ఆమె తండ్రిపై చీటింగ్ కేసు కూడా పెట్టాడు. తనకు భవ్య శారీరక సమస్యల గురించి చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేశారని కోర్టులో వివరించాడు. సుప్రీం కోర్టు అతని వాదన విన్న తరువాత కేసు విచారణకు అంగీకరించింది. 

Updated Date - 2022-03-15T05:46:43+05:30 IST