అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో అందరూ నిద్రపోతుండగా.. శరీరమంతా నిప్పంటించుకొని స్టేషన్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-09T05:47:49+05:30 IST

ఒక యువకుడు అర్ధరాత్రివేళ పోలీస్ స్టేషన్ ఎదుట నిలబడి తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత స్టేషన్ లోపలికి కేకలు వేస్తూ దూసుకెళ్లాడు. ఆ సమయంలో స్టేషన్ పోలీసులంతా...

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో అందరూ నిద్రపోతుండగా.. శరీరమంతా నిప్పంటించుకొని స్టేషన్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఒక యువకుడు అర్ధరాత్రివేళ పోలీస్ స్టేషన్ ఎదుట నిలబడి తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత స్టేషన్ లోపలికి కేకలు వేస్తూ దూసుకెళ్లాడు. ఆ సమయంలో స్టేషన్ పోలీసులంతా నిద్రపోతున్నారు. ఆ యువకుడి అరుపులకు ఒక్కసారిగా నిద్రలేచి చూసి అంతా షాకయ్యారు. ఆ యువకుడు కాలిపోతూ.. 'నా డబ్బులు నాకిప్పించండి' అని అరుస్తున్నాడు. పోలీసులు ఎలాగోలా మంటలు ఆర్పి.. ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్ పూర్ నగరంలో నివసించే సమీర్ ఖాన్(28) అనే యువకుడు కూలీ పనిచేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంత కాలం క్రితం అతనికి ఒక యువతి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ యువతికి రూ.1,80,000 డబ్బులు చాలా అవసరమని చెప్పి.. సమీర్ వద్ద అప్పు తీసుకొంది. కానీ నెలలు గడిచినా ఆమె డబ్బులు తిరిగివ్వలేదు. వివాహం చేసుకోమంటే.. అదీ కూడా కుదరదని చెప్పింది. దీంతో సమీర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


నెలల తరబడి సమీర్ ఖాన్ పోలీస్ స్టేషన్ చుట్టూతిరిగాడు. కానీ ఫలితం కనబడలేదు. దీంతో ఓపిక నశించి సమీర ఆ యువతికి చివరి సారిగా.. హెచ్చరించాడు. తన డబ్బులు తిరిగివ్వాల్సని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. చెప్పిన విధంగానే ఒకరోజు విషం మింగాడు. కానీ అతని కుటుంబ సభ్యులు కాపాడి ఆస్పత్రికి చేర్చారు.  ఆ తరువాత సమీర్ ఖాన్ ఆస్పత్రిని బయలు దేరి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. అక్కడ పోలీసులు అతడి కేసు పట్టించుకోవడం లేదని తెలిసి.. అర్ధరాత్రి పెట్రోల్ తన శరీరంపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లాడు.


ప్రస్తుతం సమీర్ ఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Updated Date - 2022-02-09T05:47:49+05:30 IST