Viral video: ప్రేయసిని కాల్చిచంపి పారిపోతుండగా.. జరిగిందో ట్విస్ట్.. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే..

ABN , First Publish Date - 2022-09-30T18:16:15+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral video: ప్రేయసిని కాల్చిచంపి పారిపోతుండగా.. జరిగిందో ట్విస్ట్.. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే..

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రియురాలితో గొడవ కారణంగా ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు ప్రియుడు. అనుకున్నట్లే తుపాకీ తెచ్చి ఆమెను వెనుక నుంచి కాల్చాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ తర్వాత అదే తుపాకీతో కాల్చుకుని సూసైడ్‌కు యత్నించాడు. కానీ, ఆ తుపాకీ పేలకపోవడంతో అక్కడి నుంచి పారిపోయే క్రమంలో చాలా సినిమాల్లో చూపించినట్లు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


ముంబైలోని బొయిసర్ ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్, నేహా మహా గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల నేహాతో శ్రీకృష్ణ ప్రతి చిన్న విషయానికి వాగ్వాదానికి దిగుతుండడంతో అతడిని ఆమె దూరం పెట్టింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీకృష్ణ ప్రేయసిని చంపాలని నిర్ణయించుకున్నాడు. నేహా రోజు ఇంటి నుంచి బయటికి వెళ్లే టీఐఎంఏ (TIMA) ఆస్పత్రి దారిలో ఆమె కోసం కాపుకాశాడు. నేహా వచ్చిన తర్వాత మరోసారి వాగ్వాదానికి దిగిన శ్రీకృష్ణ తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో షూట్ చేశాడు. దాంతో నేహా అక్కడికక్కడే కుప్పకూలింది. 


అనంతరం అదే తుపాకీతో కాల్చుకుని చనిపోవాలని ప్రయత్నించాడు. కానీ, అది పేలకపోవడంతో ఘటనాస్థలి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢికొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు శ్రీకృష్ణను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-09-30T18:16:15+05:30 IST