UP: యువతి గొంతు కోసిన యువకుడు.. కారణమేంటో తెలిస్తే.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-31T20:26:02+05:30 IST

తనతో మాట్లాడటానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు తన పొరుగింట్లో ఉండే యువతి గొంతు కోశాడు.

UP: యువతి గొంతు కోసిన యువకుడు.. కారణమేంటో తెలిస్తే.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

తనతో మాట్లాడటానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు తన పొరుగింట్లో ఉండే యువతి గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బదోనీలో ఈ ఘటన జరిగింది. బదోనీకి చెందిన గౌతమ్ అనే యువకుడు తన పొరుగున నివసించే 20 ఏళ్ల యువతితో మాట్లాడాలనుకున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది.


ఇది కూడా చదవండి..

Viral Video: సెక్యూరిటీ గార్డులపై దాడి.. సహాయం చేసినందుకు చెంప దెబ్బలు.. చివరకు ఏం జరిగిందంటే..


గౌతమ్ తరచుగా ఫోన్ చేసి విసిగిస్తుండడంతో అతని నంబర్‌ను కూడా బ్లాక్ చేసింది. దీంతో గౌతమ్ ఆమెపై తీవ్ర కోపం పెంచుకున్నాడు. తాజాగా ఆ యువతి మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా, గౌతమ్ ఆమె దగ్గరకు వెళ్లాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి పారిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2022-08-31T20:26:02+05:30 IST