విమానంలో సీటు కింద బంగారం.. ఆ సీట్లో కూర్చున్న ప్రయాణికుడిని పిలిచి విచారణ చేస్తే..

ABN , First Publish Date - 2022-02-28T05:43:35+05:30 IST

ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి దేశంలోకి బంగారం అక్రమంగా రవాణా అవుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ జైపూర్‌లో రూ.30 లక్షల విలువైన 583 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి...

విమానంలో సీటు కింద బంగారం.. ఆ సీట్లో కూర్చున్న ప్రయాణికుడిని పిలిచి విచారణ చేస్తే..

ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి దేశంలోకి బంగారం అక్రమంగా రవాణా అవుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ జైపూర్‌లో రూ.30 లక్షల విలువైన 583 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అయితే దానిని ఆ విమానంలో పెట్టింది ఎవరు? దానిని జైపూర్‌లో డెలివరీ తీసుకునేది ఎవరు? అనే విషయంలో పోలీసులకు కూడా క్లారిటీ రాలేదు. 


దుబాయ్ నుంచి జైపూర్‌ వస్తున్న విమానంలో బంగారం స్మగ్లింగ్ అవుతున్నట్టు కస్టమ్స్ అధికారులకు గురువారం సమాచారం అందింది. దీంతో వారు ఆ విమానంపై నిఘా పెట్టారు. ప్యాసింజర్లందరినీ చెక్ చేశారు. ఎవరి దగ్గరా బంగారం దొరకలేదు. అయితే విమానంలో చెక్ చేయగా సీటు కుషన్ కింద ఐదు బంగారం బిస్కెట్లు కనిపించాయి. వాటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


ఆ సీటు నెంబర్ ఆధారంగా ప్రయాణికుడు ఎవరో తెలుసుకుని అతడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ బంగారం పెట్టింది ఎవరో తనకు తెలియదని, దుబాయ్ విమనాశ్రయంలో ఒక వ్యక్తి తనకు ఉచితంగా ఆ టికెట్ ఇచ్చాడని చెప్పాడు. దీంతో అధికారులు ఈ కొత్త తరహా స్మగ్లింగ్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమానంలో నుంచి బంగారం తీసుకునే కొత్త పద్ధతిలో స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-02-28T05:43:35+05:30 IST