సూపర్ మార్కెట్లో కత్తితో దాడికి పాల్పడ్డ దుండగుడు.. నలుగురికి తీవ్ర గాయాలు!

ABN , First Publish Date - 2021-05-11T00:17:35+05:30 IST

సూపర్ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడో దుండగుడు. అక్కడ ఉన్న వారిలో నలుగురిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన న్యూజిల్యాండ్‌లో వెలుగు చూసింది.

సూపర్ మార్కెట్లో కత్తితో దాడికి పాల్పడ్డ దుండగుడు.. నలుగురికి తీవ్ర గాయాలు!

ఆక్లాండ్: సూపర్ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లపై కత్తితో దాడికి పాల్పడ్డాడో దుండగుడు. అక్కడ ఉన్న వారిలో నలుగురిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన న్యూజిల్యాండ్‌లో వెలుగు చూసింది. అయితే ఈ దుండగుడిని మిగతా కస్టమర్లంతా కలిసి పట్టేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని అక్కడకు చేరుకున్న పోలీసులకు నిందితుడిని అప్పగించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేవని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై న్యూజిల్యాండ్ ప్రధాని జకిండా ఆర్డెన్స్ కూడా స్పందించారు. ఇది టెర్రరిస్టు చర్య లని చెప్పడానికి పోలీసుల వద్ద ఎటువంటి సాక్ష్యాలూ లేవని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.

Updated Date - 2021-05-11T00:17:35+05:30 IST