స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్‌తో ప్రేమ.. విషయం తెలుసుకున్న ఫ్రెండ్ ఎంత ఘోరానికి తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-03-08T05:40:53+05:30 IST

వారిద్దరూ స్నేహితులు. తరచుగా కలిసి తిరిగేవారు. ఆ క్రమంలో ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ను స్నేహితుడికి పరిచయం చేశాడు. అప్పట్నుంచి తన స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్‌తో అతను ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెతో కలిసి తిరిగేవాడు. వారిద్దరి సాన్నిహిత్యం గురించి తెలుసుకున్న స్నేహితుడు పిచ్చివాడిలా ...

స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్‌తో ప్రేమ.. విషయం తెలుసుకున్న ఫ్రెండ్ ఎంత ఘోరానికి తెగించాడంటే..

వారిద్దరూ స్నేహితులు. తరచుగా కలిసి తిరిగేవారు. ఆ క్రమంలో ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ను స్నేహితుడికి పరిచయం చేశాడు. అప్పట్నుంచి తన స్నేహితుడి గర్ల్ ఫ్రెండ్‌తో అతను ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెతో కలిసి తిరిగేవాడు. వారిద్దరి సాన్నిహిత్యం గురించి తెలుసుకున్న స్నేహితుడు పిచ్చివాడిలా మారాడు. స్నేహానికి ద్రోహం చేశాడనే కోపంలో హత్య చేశాడు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నగరం సివిల్ లైన్ ప్రాంతానికి చెందిన సలీం ఉమర్, ఫైజ్ వార్సీ స్నేహితులు. కొన్ని రోజుల కిందట వార్సీకి సలీం తన గర్ల్ ఫ్రెండ్‌ను పరిచయం చేశాడు. స్నేహితుడి ప్రేయసి అని కూడా చూడకుండా ఆమెతో వార్సీ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమలోకి దించాడు. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఆ విషయం సలీంకు తెలిసింది. తన ప్రియురాలికి దూరంగా ఉండమని వార్సీకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. 


స్నేహితుడు వార్నింగ్ ఇచ్చినా వార్సీ తన తీరు మార్చుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సలీం స్నేహితుడిని చంపేందుకు పథకం వేశాడు. తన స్నేహితుడిని చంపేందుకు ముగ్గురు కిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు తుపాకీ కొని దానితో వార్సీని కాల్చి చంపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేసిన పోలీసులు వారం రోజుల అనంతరం నిందితులను పట్టుకున్నారు. వారి ద్వారా సలీం గురించి తెలుసుకుని అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-03-08T05:40:53+05:30 IST