వివాహ వేడుకలో వరుడి పక్కనే కూర్చున్న వ్యక్తి.. దొంగచాటుగా ఇంత పని చేశాడేంటీ..

ABN , First Publish Date - 2022-04-10T18:12:50+05:30 IST

వివాహ కార్యక్రమంలో అంతా సందడి సందడిగా ఉన్నారు. వరుడి పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా తన పని తాను కానిచ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది...

వివాహ వేడుకలో వరుడి పక్కనే కూర్చున్న వ్యక్తి.. దొంగచాటుగా ఇంత పని చేశాడేంటీ..

వేడుక సమయాల్లో ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా గడుపుతుంటారు. కార్యక్రమం పూర్తయ్యాక చూసుకుంటే.. వస్తువులో, నగలో లేక నగదో మాయమైన సంఘటనలు చాలా చూస్తూ ఉంటాం. ప్రస్తుతం సీసీ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. చిన్న చిన్న తప్పులు కూడా సాక్షాధారాలతో సహా బయటపడుతున్నాయి. వివాహ వేడకల్లో ఎంత సందడి ఉంటుందో చెప్పనక్కరలేదు. ఇలాంటి సమయాల్లో కొందరు తమ చేతి వాటం ప్రదర్శిస్తుంటారు. ప్రస్తుతం మనం చూడబోయే వీడియోలో కూడా ఓ యువకుడు ఇలాంటి పనే చేశాడు. వివాహ కార్యక్రమంలో అంతా సందడి సందడిగా ఉన్నారు. వరుడి పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా తన పని తాను కానిచ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వివాహ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బంధువులంతా సందడి సందడిగా గడుపుతుంటారు. వరుడు మాత్రం ఓ నోట్ల కట్టలతో కూడిన దండ వేసుకుని, మంచంపై కూర్చుని ఉంటాడు. అతడి పక్కన చాలా మంది కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వారిలో ఓ వ్యక్తి మాత్రం వరుడి మెడలోని నోట్లపై కన్నేసి ఉంటాడు. ఎలాగైనా నోట్లను కొట్టేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ముందుగా ఓ పెద్ద నోటును లాగడానికి ప్రయత్నిస్తాడు.

శోభనాన్ని వాయిదా వేస్తున్న భర్త.. ఓ రోజు రాత్రి నిద్రపోతోందనుకుని ఫోన్లో అతడు మాట్లాడేది ఆమె విని..


ఆ సమయంలో వరుడు ఇతడి వైపు చూస్తాడు. దీంతో ఆ వ్యక్తి సడన్‍‌గా చేయి పక్కకు తీసి, ఏమీ తెలీనట్లుగా ఉంటాడు. దీంతో వరుడు మళ్లీ తన ధ్యాసలో తాను ఉంటాడు. రెండో ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి.. కొన్ని నోట్లను తెంచేసి, ఎంచక్కా.. జేబులో పెట్టుకుంటాడు. దీన్నంతా పక్కనే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కావాలని చేసిందో, లేక యాదృచ్ఛికంగా జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

చెరువు గట్టు వద్ద.. ఈ ఆరుగురు బాలికలు కలిసి.. చివరికి ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు...





Updated Date - 2022-04-10T18:12:50+05:30 IST