Viral Video: 11000వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై వ్యక్తి డేంజర్ స్టంట్స్.. పొరపాటున అలా గనక జరిగిఉంటే.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-09-29T14:30:17+05:30 IST

ఓ వ్యక్తి డేంజర్ స్టంట్స్ చేశాడు. 11000 వోల్ట్ హైటెన్షన్ తీగలను పట్టుకుని వేలాడుతూ.. వాటిపై నడుస్తూ హల్ చల్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్

Viral Video: 11000వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై వ్యక్తి డేంజర్ స్టంట్స్.. పొరపాటున అలా గనక జరిగిఉంటే.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి డేంజర్ స్టంట్స్ చేశాడు. 11000 వోల్ట్ హైటెన్షన్ తీగలను పట్టుకుని వేలాడుతూ.. వాటిపై నడుస్తూ హల్ చల్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


కొంత మంది పొట్టకూటి కోసం గాల్లో విన్యాసాలు చేస్తారు. ప్రమాదకర స్టంట్లు చేసి.. చూపరులను ఆకట్టుకుంటారు. ఫలితంగా వాళ్లు జనాల నుంచి డబ్బులు ఆశిస్తారు. కానీ ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని అమారియా నగరాని(Amaria town)కి చెందిన నౌషాద్ అనే వ్యక్తి మాత్రం.. ఏ మాత్రం శిక్షణ లేకుండానే ఏకంగా 11000 వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడుకుని.. వేలాడుతూ.. నడుస్తూ ప్రమాదభరిత స్టంట్లు చేశాడు. అది చూసి అక్కడున్న వారంతా షాకయ్యారు. వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి.. విషయాన్ని వివరించారు. విద్యుత్‌ను ప్రసారం చేయవద్దని పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ తీగలపై నుంచి కిందకు రావాలని నౌషాద్‌ను కోరారు. అతడు ఎంతకూ వినకపోవడంతో భవనంపైకి ఎక్కి.. అతడిని కిందకి దించేందుకు ప్రయత్నించారు. ఇంతలో నౌషాద్.. విద్యుత్ వైర్లను వీడాడు. 


కొద్ది రోజుల క్రితం నౌషాద్ జాబ్ పోయిందని.. అప్పటి నుంచి అతడి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాల కారణంగా అధికారులు.. విద్యుత్‌ను నిలిపి వేశారని.. అదే సమయంలో నౌషాద్.. డేంజర్ స్టంట్లు చేసినట్టు పేర్కొన్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా(Viral in Social Media) మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘స్థానికులు గనక నౌషాద్ గురించి చెప్పి విద్యుత్ అధికారులను అలర్ట్ చేయకపోయి ఉంటే.. దారుణం జరిగిపోయేది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-09-29T14:30:17+05:30 IST