Viral video: 12 అడుగుల మొసలి నోట్లోంచి బయటపడటమంటే మాటలా?.. అందులోనూ నీటిలో ఉండగా..!

ABN , First Publish Date - 2022-08-21T16:20:14+05:30 IST

మొసలికి నీటిలో ఉంటే వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. అంటే.. మొసలి (Alligator) నీటిలో ఉండగా దానికి చిక్కితే ఇక అంతే సంగతులన్నమాట.

Viral video: 12 అడుగుల మొసలి నోట్లోంచి బయటపడటమంటే మాటలా?.. అందులోనూ నీటిలో ఉండగా..!

ఫ్లోరిడా: మొసలికి నీటిలో ఉంటే వెయ్యి ఏనుగుల బలం ఉంటుందంటారు. అంటే.. మొసలి (Alligator) నీటిలో ఉండగా దానికి చిక్కితే ఇక అంతే సంగతులన్నమాట. అలాంటిది నీటిలో ఉన్న 12 అడుగుల మొసలి నోట్లోంచి బయటపడ్డాడో వ్యక్తి. దాంతో విరోచితంగా పోరాడి మరీ ప్రాణాలు దక్కించుకున్నాడు. ఒళ్లు జలదరించే ఈ భయంకర సంఘటన అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో ఆగస్టు 3న జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యూఎస్(US) వైమానిక దళం పారారెస్క్యూ మాజీ సభ్యుడైన జువాన్ కార్లస్ లావర్డే(34) అనే వ్యక్తి ఫ్లోరిడా నివాసం ఉంటున్నాడు. ఆగస్టు 3న తాను నివాసముండే ప్రాంతానికి సమీపంలోని టోనోటోసాస్సా సరస్సుకు ఓ సూచనాత్మక వీడియో (Instructional video) షూటింగ్ కోసం వెళ్లాడు. ఆ వీడియో షూటింగ్‌లో భాగంగా సరస్సులో ఈత కొడుతున్నాడు. ఇంతలోనే అతనికి ఎదురుగా 12 అడుగుల మొసలి ప్రత్యక్షమైంది. నేరుగా వెళ్లి జువాన్ తలను నోట కరచుకుంది. దాంతో అతడు మొసలి నుంచి విడిపించుకునేందుకు విరోచితంగా పోరాడాడు. చివరకు ఎలాగోలా దాని నోట్లోంచి బయటపడి బతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ, జువాన్ తలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్‌ అవుతోంది.  




Updated Date - 2022-08-21T16:20:14+05:30 IST