Viral Video: వామ్మో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. కొండ చిలువలు మీద పాకుతున్నా ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో..!

ABN , First Publish Date - 2022-06-02T21:28:07+05:30 IST

సాధారణంగా పాములు, కొండచిలువలు అంటే చాలా మంది భయపడతారు.

Viral Video: వామ్మో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. కొండ చిలువలు మీద పాకుతున్నా ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో..!

సాధారణంగా పాములు, కొండచిలువలు అంటే చాలా మంది భయపడతారు. అవి ఉన్నాయని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది ఒక వ్యక్తి రెండు కొండ చిలువలను పైన వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


`రోజంతా కష్టపడిన తర్వాత మనకు ఇష్టమైన వాటితో కాసేపు కునుకు తీస్తే చాలా బాగుంటుంద`ని ఆ వీడియోను ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆ వ్యక్తి నిద్రపోతుండగా.. పసుపు రంగులో ఉన్న రెండు కొండ చిలువలు అతడిపై పాకుతున్నాయి. ఈ వీడియోను ఇప్పటివరకు 13 లక్షల మంది వీక్షించారు. 24 వేల మంది లైక్ చేశారు. `బాబోయ్.. మీకు నిద్ర ఎలా పడుతోంద`ని నెటిజన్లు అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. 

Updated Date - 2022-06-02T21:28:07+05:30 IST