Advertisement

వైరల్ ఫొటో: చంద్రుడు.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకే ఫ్రేమ్‌లో..

Mar 7 2021 @ 20:49PM

న్యూఢిల్లీ: చంద్రుడు..ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రుడి ముందు నుంచి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వెళుతున్న సమయంలో కనిపించిన అద్భుత దృశ్యాన్ని ఆండ్రూ మెక్కార్తీ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు.  శాక్రమెంటోలో ఈ చిత్రాన్ని క్లిక్‌మని పించినట్టు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ ఫోటోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘చాలా అరుదైన అద్భుతమైన ఫొటో ఇది. అని ఆయన కామెంట్ చేశారు. ఈ రోజు ఉదయం 2.44 గంటలకు కెమెరాతో నేను మంచి ఫొటో తీసేందుకు సిద్ధమయ్యా. అయితే..అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఇంత అద్భుతమైన యాంగిల్‌లో కెమెరా కంటికి చిక్కుతుందని నేను ఊహించలేదు. అక్కడి యాంటీనాలు కెమెరాకు అనువుగా ఏర్పాటై ఉండటమే ఇందుకు కారణం’ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. సహజంగానే ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజంగా ఓ అద్భుతం.. భలే ఫొటో తీశారు అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 


Follow Us on:
Advertisement