భార్యపై యాసిడ్ దాడి చేసి.. తప్పించుకునేందుకు ఓ భర్త చేసిన పనిది

ABN , First Publish Date - 2022-05-14T03:19:14+05:30 IST

బెంగళూరు : పోలీసులకు పట్టుబడకుండా నేరస్థులు ఎన్నో దొంగ ఐడియాలు వేస్తారు. తప్పించుకునేందుకు మారువేషాలు వేసి బోల్తా కొట్టిస్తారు. అచ్చం ఇలాగే చేద్దామని ప్రయత్నించిన ఓ నేరస్థుడు

భార్యపై యాసిడ్ దాడి చేసి.. తప్పించుకునేందుకు ఓ భర్త చేసిన పనిది

బెంగళూరు : పోలీసులకు పట్టుబడకుండా నేరస్థులు ఎన్నో దొంగ ఎత్తులు వేస్తారు. తప్పించుకునేందుకు మారువేషాలు వేసి బోల్తా కొట్టిస్తారు. అచ్చం ఇలాగే చేద్దామని ప్రయత్నించిన ఓ నేరస్థుడు పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత తప్పించుకుని పారిపోయాడు. పోలీసులకు చిక్కకుండా, తననెవరూ గుర్తుపట్టకుండా వేషధారణ పూర్తిగా మార్చివేశాడు. అతీంద్రియ శక్తులున్న మతబోధకుడిగా అవతారమెత్తాడు. తమిళనాడులోని వెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న తిరువన్నమలై జిల్లాకు మకాం మార్చాడు. అక్కడ ఓ ఆశ్రమంలో మతబోధకుడి అవతారంలో దాక్కున్నాడని పోలీసులు పసిగట్టారు. సైలెంట్‌గా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. దీంతో దొంగావతారానికి శుభంకార్డు పడింది.


నిందితుడి పేరు నగేష్ అని, ఏప్రిల్ 28న భార్యపై యాసిడ్ దాడి చేసి బెంగళూరు వదిలి పారిపోయాడని పోలీసులు చెప్పారు. అతడిని పట్టుకునేందుకు 7 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కాగా నిందితుడి భార్య అయిన బాధిత మహిళ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగలిగిందని వివరాలు చెప్పారు.

Read more