
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ పాము కంట పడితే సాధరణంగా కొంత మందికి వెన్నులో వణుకొస్తుంది. అదే.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమై పాము కింగ్ కోబ్రా ఎదురు పడితే.. ఇంకేముంది పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం భారీ సాహసం చేశాడు. ఈ క్రమంలో ఆ సర్పం అతడికి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా జడుసుకున్నాడు. అయినా తన ప్రయత్నం మానుకోలేదు. చివరికి అనుకున్నది సాధంచాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం దానికి కిస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాము పడగ తీసి ఉండగానే.. వెనకి నుంచి వచ్చి దానికి ముద్దు పెట్టబోయాడు. ఈ క్రమంలో అది అతడికి షాకిచ్చింది. ఒక్కసారిగా నోరు తెరిచి.. అతడిని కరిచేందుకు ప్రయత్నించింది. దీంతో అతడు ఒక్కసారిగా జడుసుకున్నాడు. అనంతరం తిరిగి మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. ఈ సారి మాత్రం విజయవంతంగా కింగ్ కోబ్రాకు కిస్ చేశాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు అతడి ధైర్యానికి మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి