మత్స్యకారుడికి షాకిచ్చిన చేప పిల్ల.. అతడి పరిస్థితి చూసి నోరెళ్లబెట్టిన వైద్యులు!

ABN , First Publish Date - 2022-06-03T13:13:39+05:30 IST

ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఓ చేప పిల్ల షాకిచ్చింది. చేపలు పడుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకోవడంతో అతడు ఆసుపత్రిపాలయ్యాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి చూసి వైద్యులు కంగుతిన్నారు. గతం

మత్స్యకారుడికి షాకిచ్చిన చేప పిల్ల.. అతడి పరిస్థితి చూసి నోరెళ్లబెట్టిన వైద్యులు!

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఓ చేప పిల్ల షాకిచ్చింది. చేపలు పడుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకోవడంతో అతడు ఆసుపత్రిపాలయ్యాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి చూసి వైద్యులు కంగుతిన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి కేసులు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. ఇంతకూ మత్స్యకారుడిని చేప పిల్ల ఏం చేసింది.. ఎందుకతను ఆసుపత్రికి వెళ్లాడు.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



థాయ్‌లాండ్‌లోని ఫత్తలుంగ్(Phatthalung) ప్రావిన్స్‌కు చెందిన ఓ మత్స్యకారుడు ఎప్పటిలాగే చేపల వేటకోసం స్థానికంగా ఉన్న జలాశయం వద్దకు వెళ్లాడు. ఎర వేసి చేపలు పడుతున్న సమయంలో ఓ చేప పిల్ల అతడికి షాకిచ్చింది. నీటి నుంచి నేరుగా అతడి నోట్లోకి జంప్ చేసింది. అనంతరం వాయు నాళంలో ఇరుక్కుపోయి.. అతడికి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతడు.. వైద్యులను సంప్రదించాడు. అతడి పరిస్థితి విని షాకైన వైద్యులు.. ఎక్స్‌రేలు తీసి, చేప పిల్ల ఇరుక్కుపోయిన స్థానాన్ని గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి, బాధ నుంచి అతడికి విముక్తి కల్పించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-06-03T13:13:39+05:30 IST