విమానం రెక్క ఎక్కి రచ్చచేశాడు

ABN , First Publish Date - 2020-12-14T11:13:13+05:30 IST

అమెరికాలో ఓ వ్యక్తి విమానం రెక్క ఎక్కి రచ్చచేశాడు. లాస్‌వేగాస్‌ నగరంలోని మెక్‌కారన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు

విమానం రెక్క ఎక్కి రచ్చచేశాడు

లాస్‌ వేగాస్‌, డిసెంబరు 13: అమెరికాలో ఓ వ్యక్తి విమానం రెక్క ఎక్కి రచ్చచేశాడు. లాస్‌వేగాస్‌ నగరంలోని మెక్‌కారన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకా్‌ఫకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆ విమానం రెక్కపై కనిపించాడు. రెక్కపై కాసేపు అటూఇటూ ఊగాడు. ఈలోగా అధికారులకు సమాచారం అందడంతో ఆ వ్యక్తిని వారు అదుపులోకి తీసుకోవడానికి వచ్చారు. కొంతమంది అధికారులు విమానం రెక్క ఎక్కి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు అదుపుతప్పి కింద పడ్డాడు. అనంతరం ఆ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఓ మహిళ వీడియో తీసి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆ వ్యక్తిని మానసిక రోగిగా భావిస్తున్నారు.

Updated Date - 2020-12-14T11:13:13+05:30 IST