స్త్రీలు వాడే లోదుస్తులను మాస్క్‌గా పెట్టుకున్న వ్యక్తిని చూసి ప్రయాణికులంతా షాక్.. విమాన సిబ్బంది ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2021-12-22T02:36:42+05:30 IST

ఛస్.. మాస్క్ పెట్టుకోవడం ఏంటి.. ఇదో చెత్త రూల్.. దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరమేలేదు.. ఇదీ అతడి ఫీలింగ్. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అందుకోసం అతడు ఎవ్వరూ ఊహించని పని చేశాడు.

స్త్రీలు వాడే లోదుస్తులను మాస్క్‌గా పెట్టుకున్న వ్యక్తిని చూసి ప్రయాణికులంతా షాక్.. విమాన సిబ్బంది ఏం చేశారంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఛస్.. మాస్క్ పెట్టుకోవడం ఏంటి.. ఇదో చెత్త రూల్.. దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరమేలేదు.. ఇదీ అతడి ఫీలింగ్. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు.  అందుకోసం అతడు ఎవ్వరూ ఊహించని పని చేశాడు. ఏకంగా మహిళల అండర్‌వేర్‌ను మాస్క్ లాగా ముఖానికి తొడుక్కుని విమానం ఎక్కేశాడు. అతడి చూసిన వారందరూ నోరెళ్ల బెట్టారు. మరి కొందరు ఇబ్బంది పడ్డారు..కానీ ఏమీ మాట్లాడలేకపోయారు. అతడి తీరు అసభ్యకరంగా ఉందంటూ కొందరు ఎట్టకేలకు ఎయిర్ హోస్టెస్‌కు ఫిర్యాదు చేశారు. వాళ్లు అతడి వద్దకు వచ్చి అండర్‌వేర్ తొలగించమని బతిమాలారు. అది తప్పని చెప్పే ప్రయత్నం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. 


కానీ.. ఈ మాస్క్ వ్యతిరేకి మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదు. ‘‘నోరు, ముక్కు కప్పి ఉంచేలా ఏదైనా ధరించాలి.. అంతే కదా.. ఇప్పుడు నేను తొడుక్కున్నది కూడా అదే పని చేస్తోంది కదా.. మీకొచ్చిన ఇబ్బందేంటి..’’ ఇలా సాగింది అతడి వాదన. అతడి తీరుతో విమాన సిబ్బంది  విసిగిపోయారు. అతడికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే విమానం నుంచి దింపేశారు. ఆ తరువాత.. అతడు ఎక్కిన విమానయాన సంస్థ యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా మనోడిపై నిషేధం విధించింది. మాస్క్ నిబంధనలపై ఇలాంటి వినూత్న నిరసన తెలిపిన వ్యక్తి పేరు యాడమ్ జెన్నీ. లాడర్‌డేల్ నుంచి వాషింగ్టన్‌కు వెళ్లే విమానంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. 



Updated Date - 2021-12-22T02:36:42+05:30 IST