ltrScrptTheme3

ఎందుకిలా చేశావ్.. ఇక హ్యాపీగా ఉండు.. అంటూ వీడియో తీసి మరీ ఇద్దరు పిల్లలతో సహా ఓ తండ్రి చేసిన దారుణమిది..

Oct 27 2021 @ 16:25PM

ఇంటర్నెట్ డెస్క్: చిన్న వీడియో.. కేవలం 55 సెకెన్ల నిడివి ఉన్నదే..కానీ స్థానికంగా మాత్రం పెను కలకలానికి దారితీసింది. ఓ తండ్రి తన కన్నబిడ్డలను హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు..తాను చెప్పదలుచుకున్నదంతా ఆ వీడియోలో రికార్డు చేశాడు. ‘ఎందుకిలా చేశావ్.. ఇక హ్యాపీగా ఉండు.. వచ్చే జన్మ అంటూ ఉంటే మనం కలవకూడదు’ అని అతడు తన భార్య బబితతో అన్న చివరి మాటలు. బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లా బలహా గ్రామానికి చెందిన దీపక్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం స్థానికంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.

‘‘బబితా నువ్వు ఎందుకిలా చేశావ్.. చనిపోయే వ్యక్తి ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు. అసలు మన బంధంలో లోపం ఏముంది. నీకు అంతా తెలిశాకే ఆ మందు తీసుకున్నావు. ఆ తరువాతే వారిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. మరి నువ్వు నా మీద అంత పెద్ద ఆరోపణ ఎలా చేయగలిగావు. సరే.. అవన్నీ వదిలేయ్.. మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎక్కడున్నా సరే..నీదైన ప్రపంచంలో సంతోషంగా ఉండు. ఒకే..ఇక ఉంటా మరి.. బయ్‌బయ్..’’ అంటూ వీడియో రికార్డు చేసిన తరువాత దీపక్ తన పిల్లలను చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే..దీపక్‌కు అతడి భార్య, అత్తింటి వారి మధ్య భారీ వివాదం నడుస్తోందని, దీని కారణంగా అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అతడి బంధువులు పేర్కొన్నారు. 

ఈ కేసు విషయంలో స్థానిక పోలీసులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. తన చివరి వీడియోలో దీపక్ పదే పదే ఓ ఒప్పందం గురించి ప్రస్తావించడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఆ ఒప్పందం ఏంటి? ఎవరి మధ్య అది కుదిరింది? ఆ మందు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం మృతుడి భార్యను ప్రశ్నిస్తున్నారు. అత్తారింటి నుంచి బయలు దేరిన అతడు తన ఇంటికి వచ్చే సమయంలోనే దారిలోనే ఈ వీడియో రికార్డు చేశాడని పోలీసులు తెలిపారు. ఇంటికొచ్చాక తన కుమార్తె(8), కుమారుడిని(5) హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.