ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప్రొఫైల్‌తో అబ్బాయిలకు వల.. ఓ యువకుడికి వేధింపులు.. చివరికి బాధితుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-03-18T05:46:18+05:30 IST

ఆ యువకుడు ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు.. అబ్బాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు పంపి వారితో అమ్మాయిలా మాట్లాడేవాడు. వారితో `డర్టీ టాక్` చేసేవాడు...

ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప్రొఫైల్‌తో అబ్బాయిలకు వల.. ఓ యువకుడికి వేధింపులు.. చివరికి బాధితుడు ఏం చేశాడంటే..

ఆ యువకుడు ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు.. అబ్బాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు పంపి వారితో అమ్మాయిలా మాట్లాడేవాడు. వారితో `డర్టీ టాక్` చేసేవాడు. ఆ తర్వాత ఆ మెసేజ్‌లను, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బులు గుంజేవాడు. ఇటీవల అతని బారిన పడిన యువకుడు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


హర్యానాలోని మేవాట్‌కు చెందిన నిందితుడు గత రెండేళ్లుగా ఇదే పనిలో ఉన్నాడు. టెక్నికల్‌గా మంచి జ్ఞానం ఉండడంతో అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు. అమ్మాయిల ఫొటోలు, పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసి అబ్బాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కొన్ని రోజుల క్రితం దుర్గ్ జిల్లాకు చెందిన ఓ యువకుడిని అలాగే ట్రాప్ చేశాడు. అతడితో సెక్సీగా ఛాట్ చేశాడు. అనంతరం తను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ చాట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. 


తన దగ్గర డబ్బులు లేకపోవడంతో బాధిత యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసుల విచారణలో మృతుడు ఒక అమ్మాయితో చాటింగ్ చేసేవాడని తెలిసింది. పోలీసులు మృతుడి ఫేస్ బుక్ అకౌంట్‌ని పరిశీలించగా.. అమ్మాయి పేరుతో ఒక మోసగాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తేలింది. దీంతో పోలీసులు ఆ మోసగాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. 


పోలీసులు అతడిని గట్టిగా ప్రశ్నించగా.. అతని లాగే మరో 25-30 మంది బ్లాక్ మెయిలింగ్ పని చేస్తున్నారని. తాను గత రెండేళ్లుగా ఈ పని చేస్తున్నానని చెప్పాడు.


Updated Date - 2022-03-18T05:46:18+05:30 IST