భర్త అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. కోపంతో ఏం చేసిందో తెలుసా..

ABN , First Publish Date - 2022-06-15T01:00:38+05:30 IST

కట్టుకున్న భర్త పరాయి మహిళతో శారీరక సంబంధాన్ని నెరపడాన్ని ఓ మహిళ జీర్ణించుకోలేకపోయింది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

భర్త అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. కోపంతో ఏం చేసిందో తెలుసా..

రాయ్‌పూర్ : కట్టుకున్న భర్త పరాయి మహిళతో శారీరక సంబంధాన్ని నెరపడాన్ని ఓ మహిళ జీర్ణించుకోలేకపోయింది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో ఇద్దరినీ దుస్తులన్నీ విప్పించి.. గ్రామంలో నగ్నంగా నడిపించింది. ఛత్తీస్‌గడ్‌లోని కొండగావ్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో నిందిత మహిళ(భార్య)తోపాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగ ఉన్నాయి.


నిందిత మహిళ మరో మహిళ వెంటబెట్టుకుని వెళ్లి భర్తను, అతడి సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యాండెడ్‌గా  పట్టుకుంది. అనంతరం కొంతమందిని ఘటనా స్థలికి పించింది. వచ్చినవారిలో ఆమె తరపు బంధువులు కూడా ఉన్నారు. వీరంతా తీవ్ర ఆగ్రహంతో శారీరక సంబంధం నడుపుతున్న ఇద్దరినీ దుస్తులు విప్పించారు. ఆ తర్వాత నగ్నంగా గ్రామంలో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. సెక్షన్ 354(దాడి లేదా మహిళను బలవంగా నగ్నంగా మార్చి అవమానించడం)తోపాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. నిందిత భార్య సహా నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు.


కొండగావ్ జిల్లాలోని ఉరిందాబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 11న ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీస్ బృందాన్ని గ్రామానికి పంపించామని చెప్పారు.  దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వివరించారు.

Updated Date - 2022-06-15T01:00:38+05:30 IST