అక్రమసంబంధం పెట్టుకుందని married womanను వివస్త్రను చేసి ఊరేగించారు...

ABN , First Publish Date - 2022-06-15T14:46:22+05:30 IST

ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలపై వివాహితను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించిన దారుణ...

అక్రమసంబంధం పెట్టుకుందని married womanను వివస్త్రను చేసి ఊరేగించారు...

రాయపూర్ : ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలపై వివాహితను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించిన దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలో వెలుగుచూసింది. ఉరిందబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఓ వివాహిత మరో వివాహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గ్రామస్థులు వారిద్దరిని పట్టుకొని బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగించారు.ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసు బృందాన్ని గ్రామానికి పంపి విచారణ చేపట్టారు. తన భర్త మరో వివాహితతో ఉండగా గుర్తించిన భార్య ఆమె బంధువులతో సహా కొంతమందికి ఫోన్ చేసి పిలిచిందని పోలీసు అధికారి తెలిపారు.



ఆ బృందం వారిద్దరినీ పట్టుకొని వారి బట్టలు విప్పి స్థానికంగా ఊరేగించారని పోలీసులు చెప్పారు. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఉరిందబెడ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354,ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి భార్యతో సహా నలుగురిని అరెస్టు చేశారు.తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.

Updated Date - 2022-06-15T14:46:22+05:30 IST