ఇంటిపనులు మేనేజ్‌ చేసుకోండిలా...

ABN , First Publish Date - 2022-05-19T05:30:00+05:30 IST

గృహిణులు ఎంత పని చేస్తున్నా.. పని పూర్తికాదు. నిత్యం ఏదో పని చేస్తున్నట్లే ఉంటుంది. ఒకవేళ పనిమనిషి ఉన్నా కిచెన్‌ సరిగా శుభ్రం కాలేదు.

ఇంటిపనులు మేనేజ్‌ చేసుకోండిలా...

గృహిణులు ఎంత పని చేస్తున్నా.. పని పూర్తికాదు. నిత్యం ఏదో పని చేస్తున్నట్లే ఉంటుంది. ఒకవేళ పనిమనిషి ఉన్నా కిచెన్‌ సరిగా శుభ్రం కాలేదు. ఆ పాత్రలకు జిడ్డు పోలేదు.. ఇలాంటి కంప్లయింట్స్‌ ఉంటూనే ఉంటాయి. ఇవేమీ లేకుండా పనులు సాఫీగా, వేగంగా జరిగిపోవాలంటే.. చిన్నపాటి ట్రిక్స్‌ పాటిస్తే సరి. కాస్త వర్క్‌మేనేజ్‌మెంట్‌ తెలిస్తే చాలు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ప్రస్తుతం ఆధునిక మహిళలకు సమయాన్ని ఖర్చు చేసే పరికరం.. స్మార్ట్‌ఫోన్‌. అందునా.. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడితే.. లైక్స్‌, కామెంట్స్‌ చేయటానికి సమయం తీసుకుంటే.. ఉదయం వేగంగా గడిచిపోతుంది. ఇంట్లో పని కాదు. అసలు సమయమే తెలీదు. ఫలానా వంట చేయాలని యూట్యూబ్‌ ఓపెన్‌ చేసినా.. ఆ తర్వాత మరో వీడియో అంటూ వీడియోలను చూస్తుంటే సమయం వృఽథా అవుతుంది. అందుకే ఇంట్లో పని అయ్యాకే సోషల్‌ మీడియా జోలికి వెళ్లాలనే నియమం పెట్టుకోవాలి.


పిల్లల బడి, భర్త ఆఫీసుకు వెళ్లటానికి ఫుడ్‌ ప్రిపేర్‌ చేయాలనే టెన్షన్‌లో తెగ గాబరా పడిపోవడం మంచిది కాదు. ఒక్క ఐదు నిమిషాలు కూరలు తరగడానికో, టీ కాచడానికో భర్తనూ ఇన్వాల్వ్‌ చేయాలి. భోజనం ప్రిపేర్‌ చేసే ఆ కొద్ది సమయం మాత్రమే బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఖాళీ సమయం దొరుకుతుంది. 

కొందరింట్లో పనిమనిషి ఉండదు. అయినా చక్కగా పని అంతా పూర్తవుతుంది. ఎలా అంటే.. ఆ గృహిణికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా తెలుసు. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండి చిన్న వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉండాలంటే ముందు ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయం త్వరగా లేస్తే.. సమయం ఎక్కువ ఉన్నట్లుంటుంది. ఎలాంటి చికాకులు, గందరగోళాలు ఉండవు. ఫ్రెష్‌ మూడ్‌ ఉంటుంది. అందుకే త్వరగా పనులు పూర్తవుతాయి. అందుకే రాత్రిపూట ఆలస్యం చేయకుండా త్వరగా నిద్రపోవాలి. అప్పుడే టైమ్‌ను గుప్పిట్లో పెట్టుకోవచ్చు. 


వీకెండ్స్‌లో, సెలవురోజుల్లో.. భర్తతో పాటు పిల్లలకూ వారు చేయగలిగే పనులు అప్పజెప్పడం నేర్చుకోండి. పెద్ద పాత్రలు శుభ్రం చేయడం, దుప్పట్లు ఉతకడం, సింక్‌ కడగటం, వాష్‌రూమ్‌ క్లీనింగ్‌, బూజు దులపడం, ఫ్యాన్లు తుడవడం, వాటర్‌ట్యాంక్‌ క్లీన్‌ చేయటం.. ఇలాంటి పనులు గృహిణి కాబట్టి తప్పదు అనుకోవద్దు. ఇంట్లో వారిని ఆ పనులో భాగస్వామ్యం చేస్తే సమయం కలిసొస్తుంది. మీరూ రిలాక్స్‌ అవుతారు. అలాంటప్పుడే మహిళలకు కాస్త విశ్రాంతి దొరికినట్లు ఫీలవుతారు. ఒత్తిడినుంచి ఉపశమనం పొందుతారు.


Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST