భయం..భయంగానే!

ABN , First Publish Date - 2021-04-24T04:55:59+05:30 IST

కరోనా కేసులు ఉధృతమవుతున్న వేళ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ తరగతులను మూసివేసింది. కానీ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ విష యంలో ఎటువంటి స్పష్టత లేదు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందు తున్నారు.

భయం..భయంగానే!
అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న సీడీపీవో విజయగౌరి

    అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ

  సెలవులపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

(జియ్యమ్మవలస)

కరోనా కేసులు ఉధృతమవుతున్న వేళ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ తరగతులను మూసివేసింది. కానీ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ విష యంలో ఎటువంటి స్పష్టత లేదు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందు తున్నారు. చాలామంది తమ పిల్లలను కేంద్రాలకు పంపించడం లేదు. ఐసీడీఎస్‌ అధికారులను అడుగుతుంటే ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా 17 సమగ్ర శిశు సంక్షేమ ప్రాజెక్టుల పరిధిలో 1,472 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 559 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 15,770 మంది, బాలింతలు 16,572 మంది, 0-6 వయస్సు కలిగిన పిల్లలు 1,42,986 మంది ఉన్నారు. వీరికి అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరేళ్లలోపు పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్య అం దిస్తున్నారు. 2031 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 1472 మంది ఆయాలు సేవలం దిస్తున్నారు. ప్రస్తుతం సెకెండ్‌ వేవ్‌లో కేసులు ఉధృతమవుతున్న వేళ అంగన్‌ వాడీ కేంద్రాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు భయంభయంగా గడుపు తున్నారు. దీనిపై ఐసీడీఎస్‌ పీడీ రాజేశ్వరి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. 

 

 

Updated Date - 2021-04-24T04:55:59+05:30 IST