మనఊరు - మనబడి అంచనాలు సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2022-04-24T07:26:25+05:30 IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం కింద జిల్లాలో ఎంపిక చేసిన 260 పాఠశాలల మౌలిక వసతులు కల్పించుటకు అవసరమైన అంచనాలను చేపట్టుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూ ఖీ అన్నారు.

మనఊరు - మనబడి అంచనాలు సిద్ధం చేయండి
మనఊరు - మన బడి ప్రణాళికపై అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌

నిర్మల్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 23 : ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం కింద జిల్లాలో ఎంపిక చేసిన 260 పాఠశాలల మౌలిక వసతులు కల్పించుటకు అవసరమైన అంచనాలను చేపట్టుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూ ఖీ అన్నారు. శనివారం ప్రధానోపాధ్యాయులతో, ఏఈలు, డీ ఈలు, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులతో, ఇంజనీ రింగ్‌ అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశ మందిరం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనఊరు - మనబడి పథకం కింద మొదటి విడతగా 260 ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో 220 పాఠశాలల పనుల అంచనాలకు సంబంధించిన ఫోటోలను సంబంధిత ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్లోడ్‌ చేయడం జరిగిందని, ఇంకా మిగతా పాఠశాలలు సోమవారం లోగా అంచనా వివరాలను సమర్పించాలని అన్నారు. ఈ విషయంలో అంద రూ శ్రద్ధ వహించాలని లేకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ ఈఈ శంకరయ్య, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరల్‌ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.  

పల్లెప్రగతిపై దృష్టి పెట్టండి

పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములై ఈ కార్య క్రమం విజయవంతం చేసేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా అధికార యంత్రాంగం పాటుపడాలన్నారు. శ నివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధి కారులు మండల పంచాయతీ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. పల్లెప్రగతి పనుల్లో సెగ్రిగేషన్‌ షెడ్లు, క్రిమిటోరియం, పల్లెప్రకృతి వనాలపై దృష్టి పెట్టాలన్నారు. మండలాల వారీగా గ్రామం లో ఉన్న జనాభా ప్రతిరోజు ఎన్ని కిలోల చెత్త సేకరిస్తున్నారో మండల పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణ విషయంలో ప్రణాళికబ్ధంగా దృష్టి పెట్టాలన్నారు. మురికి కాలువలో ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర చెత్త పదార్థాలు కనబడకుండా చూడాల న్నారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్‌యార్‌లకు తరలించేలా చూడాల న్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం ఏడు గంటల లోగా గ్రామాల్లో ఉండేలా సమయపాలన పాటించాలన్నారు. మొక్కలకు నీరు అందించడం, పిచ్చిమొక్కల తొలగింపు ఈ విషయంలో యంత్రాంగం బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బో ర్కడే, సీఈవో సుధీర్‌కుమార్‌, డీఆర్‌డీవో విజయలక్ష్మి, డీపీవో వెంక టేశ్వరరావు పాల్గొన్నారు. 

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఏప్రిల్‌ 23 : జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ప్రధానమంత్రి కేర్స్‌ పథకం అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిం ది. ఢిల్లీ నుండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ పర్యవేక్షణ తీరుపై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాస్థాయిలో కొవిడ్‌- 19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలల పరిరక్షణ కోసం అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమ సమితి సభ్యుడు స్వదే శ్‌ మాట్లాడుతూ... జిల్లాలో ఇద్దరు బాలలను గుర్తించి పీఎం కేర్స్‌ పోర్టల్‌ నిబంధనల మేరకు డీసీపీవో నమోదు చేశామన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నించి తర్వాత వారికి 10 లక్షల రూపాయలు వారి బ్యాంక్‌ఖాతాకు బదిలీ చేయడం పథకం ముఖ్యఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సల్ల శ్రీలత, సైమన్‌, సుందర్‌, అనిల్‌, దేవి, మురళి, శ్రీనివాస్‌, సగ్గం రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T07:26:25+05:30 IST