‘మానవత’ సేవలు అభినందనీయం : ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-03-01T05:08:59+05:30 IST

మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సేవలు అభినందనీయమని ఎస్‌ఐ సతీశ్‌ అన్నారు.

‘మానవత’ సేవలు అభినందనీయం : ఎస్‌ఐ

తాళ్లపూడి, ఫిబ్రవరి 28 : మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సేవలు అభినందనీయమని ఎస్‌ఐ సతీశ్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండలశాఖ నెలవారీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్‌ఐ మాట్లాడుతూ సంస్థ సేవలను కొనియాడారు. తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్‌ సాగర్‌ హామీ ఇచ్చారు. తాళ్లపడిలో కేన్సర్‌తో బాధపడుతున్న మాతిరెడ్డి తులసమ్మకు రూ.4వేలు, సభ్యుడు సాగర్‌ మరో రూ.500 మొత్తం రూ4,500 అధ్యక్షుడు భారనాల శంకర్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యదర్శి జోడాల వెంకటేశ్వరరావు, సీహెచ్‌ ఆంజనేయులు, గెడ్డం సాయిబాబా, గుప్త, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T05:08:59+05:30 IST