
మంచిర్యాల: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా సింగరేణిలో సోమవారం ఉదయం సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో 23 భూగర్భ,19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాగా... సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉండగా, టీబీజీకేఎస్ మద్దతు ప్రకటించింది. సమ్మెలో భాగంగా బొగ్గు గనుల వద్ద కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక నేతల వెల్లడించారు.
ఇవి కూడా చదవండి