మంచిర్యాల: బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజూ సంపూర్ణంగా కొనసాగుతోంది. కార్మికుల సమ్మెతో బెల్లంపల్లి రీజియన్‌లోని 13 అండర్ గ్రౌండ్, 8 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తొలి రోజు సమ్మెతో 50వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. కార్మికులు లేక గనులు వెలవెల బోతున్నాయి. కోల్ బెల్ట్‌లో కార్మిక సంఘాల నిరసనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి