మంచి పాలన కోసమే జిల్లాల పెంపు

ABN , First Publish Date - 2022-01-29T06:38:27+05:30 IST

మంచి పాలన కోసమే జిల్లాల పెంపు

మంచి పాలన కోసమే జిల్లాల పెంపు
మాట్లాడుతున్న వల్లభనేని వంశీ

ఉంగుటూరు, జన వరి 28 : ప్రజలకు మంచి పాలన అందిం చాలని 13 జిల్లాలను 26 జిల్లాలుగా  చేసిన ఘన త  సీఎం జగన్‌కే దక్కిందని ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ అన్నారు. మండల కేంద్రమైన ఉంగుటూరులో శుక్రవారం ఎమ్మెల్యే వంశీ  విలేకరులతో  మాట్లాడుతూ  సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేశారన్నారు.  టీటీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పేరున జిల్లా పెట్టడం చాలా సం తోషంగా ఉందన్నారు. తనతో పాటు కొడాలి నాని, శ్రీపతి రాజేశ్వర్‌ లాంటి వారికి రాజకీ యాల్లోకి రావడానికి ఎన్టీఆర్‌ స్ఫూర్తి అన్నారు. మా ముందుతరం ఎవరు రాజకీయాల్లో లేకపోయినా మేము రాజకీ యాల్లో ఉన్నామంటే ఎన్టీఆర్‌ కారణమ న్నారు. మా కోసం అంత చేసిన ఎన్టీఆర్‌కు మేము ఏమీ చేయలేకపోయామన్నారు. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం పెద్ద సంకల్పం అన్నారు. సీఎం జగన్‌ వయస్సులో చిన్నవాడైన ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమతో జిల్లాకు పేరు పెట్టడం సంతోషమన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు అడిగితే మామీద చిటపటలాడారన్నారు. 14ఏళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు పేరు పెట్టలేకపోయామన్నారు. తాను ఇప్పు డు ఏదీ మాట్లాడిన రాజకీయం అంటారని తెలిపారు. నిమ్మ కూరు ఎన్టీఆర్‌ స్వగ్రామం కావటంతో ఆ గ్రామం మచిలీపట్నంకి దగ్గరగా ఉంటుందని ఆ జిల్లాకి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని కొందరు తన వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. విజయవాడకు వ రంగా పేరు పెట్టాలని మరికొందరు తనను కలిశారన్నారు. సీఎం జగన్‌ తగు రీతిలో ఆలోచించి అందరికీ ఆమోదంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటారన్నారు.  

Updated Date - 2022-01-29T06:38:27+05:30 IST