Manchu Manoj రీఛార్జ్ అవుతున్నాడు !

Published: Sat, 25 Jun 2022 09:39:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Manchu Manoj రీఛార్జ్ అవుతున్నాడు !

యంగ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఎన్నో ప్రత్యేకతలు కలిగిన హీరో. ఆలౌరౌండర్ ఇతడు. యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తాడు, పాటలు పాడతాడు, నిర్మాణ బాధ్యతలు చూస్తాడు. అవకాశముంటే .. డైరెక్షన్ కూడా చేసేంతటి సత్తా కలిగినవాడు. టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మంచు మనోజ్.. కొన్నేళ్ళుగా తెరపై కనిపించడంలేదు. అతడికి సినిమాలపై ఆసక్తి తగ్గిందనే కామెంట్స్ వినిపించాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించినా అవి సెట్స్ పైకి వెళ్ళలేదు. అసలు అతడు ఈ మధ్యకాలంలో మీడియాకే కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ హీరో మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనోజ్ త్వరలోనే సినిమాల పరంగా తిరిగి యాక్టివ్ కానున్నాడట. 


కరోనా లాక్ డౌన్ కు ముందు అధికారికంగా ప్రకటించిన సొంత చిత్రం ‘అహం బ్రహ్మస్మి’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడట. ఈ సినిమాతో తన తల్లి పేరు మీద యం.యం.ఆర్ట్స్ (MM Arts) అనే కొత్త బ్యా్నర్‌ను ప్రారంభించాడు మనోజ్. పాన్ ఇండియా స్థాయిలో మొత్తం ఐదు భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. లాక్ డౌన్ కు ముందే మనోజ్ బాగా లావయిపోయాడు. కొన్ని నెలలుగా బరువు తగ్గించేపనిలో ఉన్నాడట. అందుకు మీడియా ముందుకు రావడం లేదని వినికిడి. ‘నేను మీకు తెలుసా (Nenu Meeku Telusa), మిస్టర్ నూకయ్య (Mister Nookayya)’ చిత్రాల్లో చాలా సన్నగా కనిపించాడు. ఇప్పుడు తిరిగి అలా తయారయ్యేందుకు బాగా కసరత్తులు చేస్తున్నాడట. బరువు తగ్గాకా.. ‘అహం బ్రహ్మస్మి’ సినిమాను ప్రారంభించబోతున్నట్టు సమాచారం అందుతోంది.  ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. అచ్చు రాజామణి (Achu Rajamani), రమేశ్ తమిళమణి (Ramesh Tamil Mani) సంయుక్తంగా సంగీతం అందించబోతున్నారు. ఇక కథానాయికగా తమిళ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఎంపికైంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International