స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు తెలిపిన మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-03-13T00:28:42+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి హీరో మంచు విష్ణు మద్దతు తెలిపారు. శుక్రవారం విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాలు

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు తెలిపిన మంచు విష్ణు

విశాఖ: స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి హీరో మంచు విష్ణు మద్దతు తెలిపారు. శుక్రవారం విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి స్టీల్ ఫ్లాంట్ సాధించారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వందశాతం తప్పుడు నిర్ణయమన్నారు. తెలుగువారంతా ఒకటి కావాలి.. ప్రజలే తమకు ప్రత్యక్ష దైవాలని చెప్పారు. సినీ నటులకు స్టీల్‌ప్లాంట్‌కు మద్దతు ఇవ్వాలని ఉన్నా.. కొన్ని రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారని విష్ణు పేర్కొన్నారు. ప్రజా సమస్యల్ని తమ సమస్యలుగా భావిస్తామని ప్రకటించారు. సినీ పెద్దల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తామని మంచు విష్ణు చెప్పారు.


సినీ పరిశ్రమ నుంచి అందరికంటే ముందు మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన గళం విప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలకు ప్రతీక అంటూ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు.  పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని, నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తామనే నినాదాన్ని రాశామంటూ ఆనాటి రోజులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2021-03-13T00:28:42+05:30 IST