మాదిగలకు గౌరవం, గుర్తింపు కోసమే పోరాటం

ABN , First Publish Date - 2021-02-28T04:37:20+05:30 IST

మాదిగలకు గౌరవం, గుర్తింపు కోసమే పోరాటం

మాదిగలకు గౌరవం, గుర్తింపు కోసమే పోరాటం
పరకాలలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

పరకాల, ఫిబ్రవరి 27 : మాదిగలకు విలువ, గౌరవం, గుర్తింపు తేవడం కోస మే పోరాడుతున్నానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది గ అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడే ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. దళిత బిడ్డల అసౌండ్‌ భూములను లాక్కొని డం పింగ్‌ యార్డ్‌, శ్మశాన వాటిక, పల్లెప్రకృతి  ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 11మంది దళిత ఎమ్మెల్యే ఉన్నా మంత్రి వర్గంలో ఒక్కరు కూడా లేర ని విమర్శించారు. కార్యక్రమంలో మంద కుమార్‌, పుట్టరవి, మంద రాజు,  బి. దిలీప్‌, ఏకు శంకర్‌, కోడెపాక భాస్కర్‌, అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

నడికూడ: తెలంగాణలో ఎల్లకాలం టీఆర్‌ఎస్‌ రాజ్యం ఉండదని, దళితు ల రాజ్యం వస్తుందని మందకృష్ణ అన్నారు. నడికూడలో దళితుల భూముల ను సందర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నడికూడలో 70ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములకు  పట్టాలు ఇవ్వకుండా, తీసుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించా రు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అఽధికార ప్రతినిధి మంద కుమార్‌ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పటి మొగిలి, జిల్లా కార్యదర్శి కొడెపాక భాస్కర్‌, మంద రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, నడికూడ మండల కేం ద్రానికి చెందిన దుప్పటి పెద్దులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించారు. 

పరకాలరూరల్‌: పరకాల మునిసిపాలిటీకి చెందిన డంపింగ్‌ యార్డును పోచారం నుంచి తరలించకుంటే, మరో ఉద్యమం తప్పదని మందకృష్ణ హెచ్చరించారు. పరకాల మండలం పోచారంలోని డంపింగ్‌ యార్డును పరిశీలించా రు. కేసీఆర్‌ ప్రభుత్వం డంపింగ్‌ యార్డులు, ప్రకృతివనాలు, శ్మశాన వాటికల పేరిట దళితుల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో మంద కుమార్‌ మాదిగ, ఎంపీటీసీ కోరె రమేష్‌, సర్పంచ్‌ పెండ్లి పద్మబాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T04:37:20+05:30 IST