Cm మేడారం రాకపోవడం దురహంకారమే..

ABN , First Publish Date - 2022-02-25T18:40:05+05:30 IST

సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకాకపోవడం దురంహకారానికి నిదర్శనమేనని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

Cm మేడారం రాకపోవడం దురహంకారమే..

                  - ఎంఎస్పీ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ


మేడారం(ములుగు): సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకాకపోవడం దురంహకారానికి నిదర్శనమేనని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. గురువారం ఆయన మేడారాన్ని సందర్శించారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నా రు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మేడారం మహాజాతర పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఏడాదిలో ఐదారుసార్లు యాదాద్రికి వెళ్లే కేసీఆర్‌.. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. ములుగు జిల్లాకు వనదేవతల పేర్లు పెట్టాలనే విషయాన్ని ముఖ్యమంత్రి విస్మరించారని విమర్శించారు. యాదాద్రి, భద్రాద్రి జిల్లాలకు ఆయా దేవుళ్ల పేర్లు పెట్టిన సీఎం.. ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మల పేర్లు ఎందుకు పెట్టడంలేదని దుయ్యబట్టారు. వెయ్యి కోట్లు ఖర్చుచేసి యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారని, దేశంలో పెద్దదైన గిరిజన మహాజాతరకు అరకొరకు మాత్రం అరకొర నిధులు కేటాయిస్తూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మంద కృష్ణను మేడారం పూజారులసంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు సన్మానించి, తల్లు ల ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2022-02-25T18:40:05+05:30 IST