ఎయిమ్స్‌లో టెలీ మెడిసిన్‌ సేవలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-12-05T05:56:58+05:30 IST

స్థానిక ఎయిమ్స్‌ ఆసుపత్రిలో టెలీ మెడిసిన్‌ సేవలను శనివారం నుంచి పునః ప్రారంభించారు.

ఎయిమ్స్‌లో టెలీ మెడిసిన్‌ సేవలు పునఃప్రారంభం

మంగళగిరి, డిసెంబరు 4: స్థానిక ఎయిమ్స్‌ ఆసుపత్రిలో టెలీ మెడిసిన్‌ సేవలను శనివారం నుంచి పునః ప్రారంభించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి వార్తల నేపథ్యంలో ఈ ఫార్మశీ సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్టు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ త్రిపాఠి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టెలీ మెడిసిన్‌కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఈ దిగువ తెలిపిన ఫోన్‌ నెంబర్లను సంప్రదించాల్సి వుంటుంది.

     సామాజిక కుటుంబ వైద్యసేవలకోసం 9494908320

     చెవి, ముక్కు, గొంతు విభాగం- 9494906407

     జనరల్‌ మెడిసన్‌ సేవల కోసం -9494908526

     జనరల్‌ సర్జరీ విభాగం - 9494901428

     ప్రసూతి మహిళల విభాగం-9494907302

     చిన్న పిల్లల విభాగం- 9494902674

     దంతవైద్య విభాగం- 9494907082

     నేత్ర వైద్య విభాగం- 9494905811

     చర్మవ్యాధుల విభాగం- 9494908401

     మానసిక వైద్యవిభాగం- 9494730332

     విచారణ నిమిత్తం 9493906571లేదా 8523007940

ఈ నెంబర్లలో సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల మధ్య ఫోన్‌ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. తద్వారా ఇంటివద్దనుంచే టెలీ మెడిసిన్‌ సేవలను పొందవచ్చు.

Updated Date - 2021-12-05T05:56:58+05:30 IST