బోనాల పాట వివాదంపై స్పందించిన మంగ్లీ

ABN , First Publish Date - 2021-07-21T19:49:36+05:30 IST

బోనాలపై మంగ్లీ పాడిన పాట వివాదం చెలరేగుతోంది. అయితే ఈ వివాదంపై ఆమె స్పందించారు. పాట వివాదంపై ప్రకటన విడుదల చేశారు.

బోనాల పాట వివాదంపై స్పందించిన మంగ్లీ

హైదరాబాద్‌: బోనాలపై సింగర్ మంగ్లీ పాడిన పాట వివాదం చెలరేగుతోంది. అయితే ఈ వివాదంపై ఆమె స్పందించారు. పాట వివాదంపై ప్రకటన విడుదల చేశారు. పాటపై విమర్శలు వచ్చిన రోజేనే మార్చేశామని తెలిపారు. గ్రామదేవతను ఎలా పూజిస్తారో తెలుసుకుని విమర్శిస్తే మంచిదని మంగ్లీ పేర్కొన్నారు.


బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారని మంగ్లీపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్ మంగ్లీపై ఆరోపణలు వచ్చాయి. తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి పాటను తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని పలువురు బీజేపీ కార్పొరేటర్లు సీపీని కోరారు.

Updated Date - 2021-07-21T19:49:36+05:30 IST