మామిడితో మెరిసే చర్మం...

Published: Wed, 27 May 2020 09:18:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మామిడితో మెరిసే చర్మం...

ఆంధ్రజ్యోతి(27-05-2020)

ఇప్పుడు ఎక్కడ చూసినా మామిడిపండ్లు నోరూరిస్తుంటాయి. తీయని మామిడి గుజ్జులో సౌందర్య గుణాలు చాలానే. ఎండకు కందికపోయిన చర్మాన్ని ఇంటిపట్టునే మ్యాంగో ఫేస్‌ప్యాక్‌తో కాంతిమంతంగా మార్చుకోండిలా...


కావలసినవి: బాగా మగ్గిన మామిడి పండు, ముల్తానీ మట్టి- మూడు టేబుల్‌ స్పూన్ల , రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌- రెండు స్పూన్లు, పెరుగు- కప్పు.


తయారీ: ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలిపితే మ్యాంగ్‌ ఫేస్‌ప్యాక్‌ రెడీ. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలాచేస్తే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.