మాణికం ఠాకూర్‌ చొరవ

ABN , First Publish Date - 2021-05-07T06:03:00+05:30 IST

కరోనా బారిన పడి చెన్నై ఆసుపత్రుల్లో బెడ్‌ దొరక ఇబ్బంది పడుతున్న భువనగిరి వాసికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మాణికం ఠాకూర్‌ చొరవ తీసుకుని వైద్యంసాయం అందించారు.

మాణికం ఠాకూర్‌ చొరవ
మాణికం ఠాకూర్‌ ట్విట్‌

భువనగిరి వాసికి కరోనా వైద్యం

యాదాద్రి, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి చెన్నై ఆసుపత్రుల్లో బెడ్‌ దొరక ఇబ్బంది పడుతున్న భువనగిరి వాసికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మాణికం ఠాకూర్‌ చొరవ తీసుకుని వైద్యంసాయం అందించారు. భువనగిరికి చెందిన విద్యావేత్త తాడూరి చంద్రయ్య అల్లుడు ఆనంద్‌కుమార్‌ కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో చెన్నెయ్‌ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ బెడ్స్‌ లేవని చేర్చుకోలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన మామ చంద్రయ్య భువనగిరి మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ను సంప్రదించగా, ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇనచార్జీ మాణి కం ఠాకూర్‌ను ఫోనలో సంప్రదించగా వెంటనే స్పందించి వైద్యసహాయం ఏర్పాటు చేశారు. పెరంబందూర్‌ ఎమ్మెల్యేను స్వయంగా ఆసుపత్రికి పంపించి బెడ్‌ ఏర్పాటు చేయడమే కాకుండా మెరుగైన వైద్యం అందజేసి ప్రాణాపాయం నుంచి బయటవేశారు. ఈ విషయాన్ని తిరిగి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి మాణికం ఠాకూర్‌ స్వయంగా ప్రమోద్‌కుమార్‌కు ట్విట్టర్‌ వేదికగా తెలియజేశాడు.  

Updated Date - 2021-05-07T06:03:00+05:30 IST