బ్లూక్రాస్‌తో మణికొండ మున్సిపాలిటీ ఎంవోయూ

Jul 23 2021 @ 00:43AM

నార్సింగ్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి):  మణికొండ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకోవడం, న్యూటరింగ్‌ చేయడం, టీకాలు వేయడం మరియు డి-వార్మింగ్‌ కోసం మణికొండ మున్సిపాలిటీ బ్లూ క్రాస్‌తో ఒక అవగాహన ఒప్పందంపై గురువారం సంతకం చేసింది. ఈ సందర్భంగా కమిషనర్‌ జయంత, వైస్‌ చైౖర్మన్‌ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ  బ్లూ క్రాస్‌ ఒక జంతు సంక్షేమ బోర్డు, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ. దాదాపు రెండు వేల కుక్కలు మణికొండ, పుప్పాల్‌గూడ, నెక్నాంపూర్‌లో ఉన్నాయి. ఈ డ్రైవ్‌లో భాగంగా, కస్తూరి నరేందర్‌, కమిషనర్‌, ఎన్విరానమెంట్‌ ఇంజనీర్‌, సోషల్‌ వర్కర్‌, జంతు సంక్షేమ సంస్థ సభ్యుడు, వెటర్నరీ వైద్యుల అధ్యక్షతన మున్సిపల్‌ అధికారుల ప్రతినిధులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.  కుక్కల నియంత్రణ కోసం మణికొండ మున్సిపాలిటీ పౌరులు సంప్రదించవలసిన చిరునామా మిస్టర్‌ గణేష్‌, ప్రోగ్రాం ఇనచార్జి, మణికొండ మునిసిపాలిటీ, ఫోన నెంబరు 6301327173.

Follow Us on: