మహిళా కమిషన్‌ ఉత్తరాంధ్ర రూరల్‌ ఇన్‌చార్జిగా మణికుమారి

ABN , First Publish Date - 2021-03-20T05:54:35+05:30 IST

మహిళా కమిషన్‌ ఉత్తరాంధ్ర రూరల్‌ ఇన్‌చార్జిగా మాజీ మంత్రిని మత్స్యరాస మణికుమారిని నియమిస్తూ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఉత్తర్వులు జారీచేశారు.

మహిళా కమిషన్‌ ఉత్తరాంధ్ర రూరల్‌ ఇన్‌చార్జిగా మణికుమారి
మణికుమారి



చింతపల్లి, మార్చి 19: మహిళా కమిషన్‌ ఉత్తరాంధ్ర రూరల్‌ ఇన్‌చార్జిగా మాజీ మంత్రిని మత్స్యరాస మణికుమారిని నియమిస్తూ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం గుంటూరులో మహిళా కమిషన్‌ వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మణికుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ సభ్యులు ప్రాంతాల వారీగా విధులు నిర్వహించేందుకు జిల్లాలను కేటాయించారు. మత్స్యరాస మణికుమారికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్‌, గిరిజన ప్రాంతాల పర్యవేక్షకురాలుగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకర్లకు ఫోన్‌లో మాట్లాడుతూ.. మహిళా భద్రత కోసం ప్రతీ ఒకరికి అవగాహన కల్పించే బాధ్యత కమిషన్‌ తీసుకుంటుందన్నారు. ఈనెల 30న విశాఖపట్నం జిల్లా కేంద్రంలో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖ శర్మ ఆధ్వర్యంలో మహిళా సర్పంచ్‌లు, గ్రేటర్‌ విశాఖ, మునిసిపాలిటి కార్పొరేటర్లకు  శిక్షణ, వర్కుషాపు నిర్వహించడం జరుగుతుందని మణికుమారి తెలిపారు. 

Updated Date - 2021-03-20T05:54:35+05:30 IST