Advertisement

మాణిక్యాలరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు: కృష్ణంరాజు

Aug 1 2020 @ 17:05PM

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా మహమ్మారి వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో నెల రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలై అంచలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు. భారతీయ జనతా పార్టీకి ఆయన చేసిన సేవను మరువలేము. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణవార్త వినగానే చాలా బాధేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను..’’ అని తెలిపారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.