మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు మార్చిన ఈసీ

ABN , First Publish Date - 2022-02-11T00:42:59+05:30 IST

2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు (28) గెలుచుకున్నప్పటికీ మెజారిటీ మార్క్‌కు 2 స్థానాల ముందు ఆగిపోయింది. దీంతో స్థానిక నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌, బీజేపీ కలయికలో ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు బీజేపీ ప్రకటించింది...

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు మార్చిన ఈసీ

ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. రెండు విడతల్లో జరగాల్సిన ఈ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27, మార్చి 3న జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 27 తేదీన జరగాల్సిన పోలింగ్ ఫిబ్రవరి 28న, మార్చి 3న జరగాల్సిన పోలింగ్‌ మార్చి 5న నిర్వహించనున్నట్లు గురువారం జారీ చేసి ఓ ప్రకటనలో ఎన్నికల సంఘం పేర్కొంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్‌ అసెంబ్లీలో ఎన్డీయే అధికారంలో ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు (28) గెలుచుకున్నప్పటికీ మెజారిటీ మార్క్‌కు 2 స్థానాల ముందు ఆగిపోయింది. దీంతో స్థానిక నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌, బీజేపీ కలయికలో ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.

Updated Date - 2022-02-11T00:42:59+05:30 IST