రేపు పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్‌ను కలవనున్న భగవంత్ మాన్

ABN , First Publish Date - 2022-03-11T15:54:38+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలకనాయకుడు భగవంత్ మాన్ శనివారం నాడు ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలవనున్నారు....

రేపు పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్‌ను కలవనున్న భగవంత్ మాన్

చండీఘడ్: పంజాబ్ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలకనాయకుడు భగవంత్ మాన్ శనివారం నాడు ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలవనున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఏకైక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమ ఆప్ కు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని మాన్ గవర్నరును కోరనున్నారు.పంజాబ్ ప్రస్థుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం శుక్రవారం 11.30 గంటలకు జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చన్నీ పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. 


పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిపెట్టిన భగవంత్ మాన్ శుక్రవారం ఢిల్లీకి వచ్చి ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను కలవనున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న ఆప్ ఈ సారి గుజరాత్ పై గురి పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని చేపట్టి ఆప్ ను పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. గుజరాత్ రాష్ట్రంలో ఆప్ పటిష్ఠానికి ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో తిరంగా యాత్ర జరపాలని నిర్దేశించారు. గుజరాత్ రాష్ట్రంలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించాలని కూడా నిర్ణయించారు. 


Updated Date - 2022-03-11T15:54:38+05:30 IST