సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథానిక‌’.. రెడీ టు రిలీజ్‌

Apr 17 2021 @ 19:00PM

థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరోహీరోయిన్లుగా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణంతో.. జగదీష్ దుగన దర్శకత్వంలో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం 'కథానిక'. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేయటానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌ వివరాలను తెలిపేందుకు చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. 


ఈ కార్యక్రమంలో నిర్మాత రామారావు లెంక మరియు పద్మ లెంక మాట్లాడుతూ.. మేము ఈ చిత్రాన్ని కరోనా టైమ్‌లో షూటింగ్ చేశాం. మా చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరూ బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ జగదీష్ దుగన అద్భుతంగా చిత్రీకరించారు. ఈ నెల ఏప్రిల్ 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.. అని తెలిపగా దర్శకుడు జగదీష్ దుగన మాట్లాడుతూ.. మా కథానిక చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు తెర మీదకి ఈ కథ రాలేదు. మా నిర్మాతలు సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చుపెట్టారు. మ్యూజిక్ లొకేషన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 23న విడుదల అవుతుంది. అందరు చూసి మా టీమ్‌ని ఆశీర్వదించండి.. అని అన్నారు.

హీరో సాగర్ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. కరోనా టైమ్‌లో ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. ఏప్రిల్ 23న విడుదల అవుతుంది" అని హీరో సాగర్‌ చెప్పగా.. హీరోయిన్ నైనీషా మాట్లాడుతూ.. నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శకుడు జగదీష్ దుగన, నిర్మాత శ్రీమతి పద్మ లెంకగారికి నా ధన్యవాదాలు. కరోనా టైమ్‌లో సినిమా చిత్రీకరించాం. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది..అని తెలిపింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.